మంత్రి వెల్లంపల్లిని భర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి ఉమా డిమాండ్ చేశారు. ఈవో బాధ్యత రాహిత్యగా మాట్లాడుతున్నారన్న ఆయన సింహాలు పోయాయి అని క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆపకుండా వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడుతుందని అయన అన్నారు. ఐఏఎస్ స్థాయి అధికారిని మార్చి ఎందుకు కింద స్థాయి అధికారిని ఈవో గా తీసుకువచ్చారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఈవో ని సస్పెండ్ చేసి ఒక పూర్తి స్థాయి జ్యూడిషల్ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ 16 నెలల్లో జరిగిన అన్ని ఘటనలను అన్ని సీబీఐ చేస్తా విచారణ జరిపించాలని దేవాలయాలు, చర్చ, మసీదులు పై దాడులను టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. 24 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకూ పోలీస్ కేస్ పెట్టలేదన్న ఆయన భక్తుల మనోభావాలు కాపాడాల్సిన భద్యత మంత్రికి, ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. ఈ ఘటనల పై వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలని, ఆయన కోరారు. నిందితులను కాపాడాలనే ప్రయత్నం ఇక్కడ అధికారులు, మంత్రి చేస్తున్నారని రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాలలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని అన్నారు.