తిరుమల శ్రీవారి ఆలయంలోకి మొబైల్ తీసుకెళ్లిన భక్తుడు.. వీడియో వైరల్

-

తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతలోని డోల్లతనం మరోసారి బయటపడింది. మూడు అంచల భద్రతను దాటి మరి ఓ భక్తుడు మొబైల్ ఫోన్ తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. మొబైల్ ఫోన్ తో వెళ్లిన సదరు భక్తుడు శ్రీవారి ఆలయంలో హల్చల్ చేశాడు.

ఆలయంలో నలవైపులా నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్ లో చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో చూసినట్లయితే వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటన పై టీటీడీ పాలక మండలి అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయం పై టీటీడీ పాలక మండలి అధికారులు  ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version