దివ్యాంగులకు బైక్స్ ఇస్తామని ప్రకటన చేసింది చంద్రబాబు సర్కార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. జనాభాలో 2.23 శాతం ఉన్న దివ్యాంగులకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దివ్యాంగుల హక్కులను కాపాడడంతో పాటు వారి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని… గత 5 ఏళ్ళు వైసిపి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి తూట్లు పొడిచిందని ఆగ్రహించారు.
దివ్యాంగుల ఫించన్ ను 3 వేల నుంచి 6 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదేనని… దివ్యాoగుల పాఠశాలలు, వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని… దివ్యాంగ విద్యార్దులకు బ్రెయిలీ పుస్తకాలను విద్యా సంవత్సరం మొదటిలోనే ఇస్తామని ప్రకటించారు.దివ్యాంగులకు త్రీవీలర్స్ అందిస్తాం… దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటనలో వివరించారు.