భారత్‌ అభివృద్దిలో ఏపీది కీలక పాత్ర – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

-

భారత్‌ అభివృద్దిలో ఏపీది కీలక పాత్ర ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇవాళ ఏపీలో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండే ఈ నేల పై అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి వంటి నదులు ఈ రాష్ట్ర నేలను సారవంతం చేశాయని వెల్లడించారు.

నాగార్జున సాగర్, నాగార్జున కొండ, అమరావతి భారత దేశ చారిత్రక వారసత్వ సంపద అని.. కూచిపూడి నృత్యం భారత సాంస్కృతిక వైశిష్ట్యమని పేర్కొన్నారు. ముర్ము దేశ భాషలందు తెలుగు లెస్సా అనగానే ….ఆహుతుల నుంచి పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు అని.. దేశంలోని అన్ని భాషల్లో తెలుగు శ్రేష్టమైంది.. నన్నయ్య, మల్లన్న, తిక్కన నడయాడిన నేల ఇదని పేర్కొన్నారు. మొల్ల రాసిన మొల్ల రామాయణానికి చరిత్రలో విశిష్ట ప్రాధాన్యత ఉందని చెప్పారు. జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రసంగం ముగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read more RELATED
Recommended to you

Exit mobile version