చంద్రబాబు హయాంలో 108 వాహనాలు షెడ్డుకే పరిమితం – కొడాలి నాని

-

నేడు గుడివాడలో 10.28 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ 2 ని ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి ప్రారంభించారు మంత్రి విడుదల రజనీ. హాస్పటల్ ప్రాంగణంలో స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు మంత్రి రజిని, ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. వైద్యుడు కాబట్టే సీఎంగా వైద్య రంగంలో వైయస్సార్ ఎన్నో మార్పులు తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి కృషితో ఆరోగ్య శ్రీ,108,104 వైద్య సేవలు మారుమూల గ్రామాలకు చేరుతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో 108,104 వాహనాలు షెడ్డుకే పరిమితం అయ్యాయని ఆరోపించారు. వైయస్సార్ లేకుంటే ఆరోగ్యశ్రీ అనే పథకం రాకా లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు కొడాలి నాని. ప్రజల ఇబ్బందులను తెలుసుకొని 10 కోట్ల 28 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version