కూటమి బడ్జెట్ తో ప్రతీ ఒక్కరికీ నిరాశే : మంత్రి బుగ్గన

-

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ప్రతీ ఒక్కరికి నిరాశే మిగిలిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నెలలోనే బడ్జెట్ ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వానికి 5 నెలలు ఎందుకు పట్టింది అన్నారు. అమరావతికి చూపించిన రూ.15వేల కోట్లు గ్రాంటో.. అప్పో చెప్పలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు అసలు కేటాయింపులే లేవు అన్నారు. కొన్నింటికి మాత్రమే కేటాయింపులు రూ.41వేల కోట్లు ఎక్కువ చూపించారని విమర్శించారు బుగ్గన రాజేంద్ర నాథ్.

నెగిటివ్ నోట్ తో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టిందన్నారు. 15 15 18 అని ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో.. ఆ స్కీమ్స్ వల్ల 2024 ఎన్నికల్లో ఓటర్లు  ఓటు వేసిన వారి చాలా ప్రభావం ఉందని ఎవ్వరైనా చెబుతారు. మేము అధికారంలోకి వచ్చిన ఒక నెలలోనే బడ్జెట్ పెట్టాం.  బడ్జెట్ పెట్టడానికి ఐదు నెలలు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఏది ఏమైనా ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూసిన తరువాత ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వారి అడిఆశలయ్యాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version