చంద్రబాబును కలిసిన పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ కుటుంబ సభ్యులు

-

చంద్రబాబును పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. ఈ టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…పుంగనూరులో చంద్రబాబు పర్యటన లేకున్నా.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు టూర్లో భయానక వాతావరణం సృష్టించాలనే ఉద్దేశ్యంతో వైసీపీ నేతలు.. పోలీసులు కుట్రలు పన్నారని ఆరోపించారు.

వజ్రా వాహానాలను.. భాష్పవాయి గోళాలను సిద్దం చేసుకున్నారని..పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డిని వైసీపీ టార్గెట్ చేసిందని మండిపడ్డారు. బాబు రెడ్డిని ఎన్ కౌంటర్ చేయడానికైనా వెనుకాడారనే ఆందోళన మాకుందని పేర్కొన్నారు. చల్లా బాబు రెడ్డి సోదరి వీణా రెడ్డి మాట్లాడుతూ…వైసీపీ నేతలు మా కుటుంబాన్ని.. కార్యకర్తలను వేధిస్తున్నారు…గొడవలకు వెళ్లే కుటుంబం మాది కాదన్నారు. మా తమ్ముడ బాబురెడ్డికి ఆపద ఉందని..చంద్రబాబు ధైర్యాన్నిచ్చారని వెల్లడించారు. మా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు వివరించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version