ఏపీలో తొలి బర్డ్ ప్లూ మరణం.. రంగంలోకి కేంద్రం..!

-

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ప్లూ మరణం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బర్డ్ ప్లూ తో తొలి మరణం చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏపీలో తొలి మరణం పై కేంద్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. నరసరావుపేటకు చెందిన రెండేల్ల చిన్నారి బర్డ్ ప్లూతో మరణించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది. ఢిల్లీ ఎన్సీబీకి చెందిన ముగ్గురు సభ్యులతో పాటు ముంబైకి చెందిన మరో డాక్టర్ మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ తో కలిపి ఒక బృందంగా అధ్యయనం చేశారు. మొదట ఎయిమ్స్ లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర వైద్య బృందం.. అసలు చిన్నారి పరిస్థితి ఏంటి..? ఎప్పుడు జబ్బు పడింది. ఆసుపత్రిలో ఎప్పుడూ చేరారు.. ఆమెకు అందించిన చికిత్స ఏంటి..? ఎలాంటి వైద్యం అందించారు. 

అనే దానిపై చర్చించారు. చిన్నారి మృతి చెందిన నరసరావుపేటకు వెల్లిన కేంద్ర వైద్య బృందం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబ సభ్యులు చికెన్ కొన్న షాపు వద్దకు వెళ్లి శాంపిల్స్ సేకరించారు. కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించి పూర్తి సమాచారం సేకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version