తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడేళ్ల పాపపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. అనంతరం దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలలో తీవ్రదుమారానికి కారణమైంది. ఏయం పురం లో నివసించే చిన్నారిపై అదే గ్రామానికి చెందిన సుశాంత్ కి దారుణానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇస్తానంటూ మాయమాటలు చెప్పి చిన్నారిని తీసుకువెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు.
అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టాడు. ఈ ఘటన పట్ల కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరిగితే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొక్కి నార తీస్తానని అన్నారు.. ఆయన ఇప్పటివరకు ఎంతమందిని తొక్కినారా తీసారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనల పట్ల కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు రోజా. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఇలాంటి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక హోం శాఖ మంత్రిగా ఒక మహిళ ఉన్నప్పటికీ ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.