తన కొడుకు మోహిత్‌రెడ్డి అరెస్ట్‌ పై స్పందించిన చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి

-

తన కొడుకు మోహిత్‌రెడ్డి అరెస్ట్‌ పై స్పందించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిది అక్రమ అరెస్ట్‌ అంటూ ఆగ్రహించారు. శనివారం రోజున రాత్రి చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నానిపై దాడి సమయంలో కలెక్టర్, జేసీ సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలోనే మోహిత్‌ రెడ్డి ఉన్నాడని తెలిపారు.

 

Former YCP MLA Chevireddy Baskar Reddy reacted to the arrest of his son Mohit Reddy

దాడి జరిగిన 52 రోజుల తర్వాత కేసులో ఏ–37గా పేరు పోలీసులు చేర్చినట్లు తెలిపారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి. అక్రమ అరెస్ట్‌లకు బెదరమని తేల్చి చెప్పారు. వారం రోజులుగా స్వగ్రామంలో ఉన్నా పట్టించుకోలేదు ఖాకీలు అంటూ ఆగ్రహించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి. స్నేహితుడి పెళ్లికి దుబాయ్‌ వెళ్తుండగా బెంగళూరులో అరెస్ట్‌ అయినట్లు వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగమే నా కోడుకు అరెస్టు అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version