ఏపీలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం..!

-

శ్రీకాకుళం జిల్లా రాజాంలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఓ శుభ కార్యక్రమానికి రాజాం వచ్చిన గౌతమ్ అనే యువకుడిని నవీన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. గొల్లవీధి – డోలపేట యువకుల మధ్య ఉన్న పాత కక్షలు మళ్లీ పడగవిప్పాయి. గొల్లవీది యువకులపై నవీన్ గ్యాంగ్ కక్ష కట్టింది. అయితే, ఆ గ్యాంగ్ కు శ్రీకాకుళంకు చెందిన గౌతమ్ పట్టిబడ్డాడు. దాదాపు మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి నవీన్ గ్యాంగ్ చావ బాదింది.

గౌతమ్ ను కొట్టిన ఫొటోలను నవీన్ గ్యాంగ్.. గొల్లవీధి యువకులకు పోస్ట్ చేసింది. అలర్ట్ అయిన గొల్లవీధి యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, గురవాం తోటలో అపస్మారక స్థితిలో ఉన్న గౌతమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల రాకను గమనించి నవీన్ గ్యాంగ్ అప్పటికే పరారైంది. మొత్తం ఎనిమిది మంది ఈ కిడ్నప్ లో భాగస్వామ్యం అయినట్లు సమాచారం. వారి కేసం మూడు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ప్రాణాపాయం స్థితిలో ఉన్న గౌతమ్ రాజాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version