పోలవరం ప్రాజెక్టు వద్ద పెరిగిన గోదావరి వరద

-

పోలవరం ప్రాజెక్టు వద్ద  గోదావరి వరద పెరిగింది.  స్పిల్ వే వద్ద 32.9 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 10లక్షల 59వేల క్యూసెక్కుల  నీరు ప్రవాహిస్తుంది.  కనకయ్యలంక కాజ్ వే పై గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ప్రధానంగా పడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు స్థానికులు. ఎర్రకాలువ వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది.

 


అంబేద్కర్ కోనసీమ జిల్లా ధవలేశ్వరం వద్ద గోదావరి రెండోవ ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. ఇక కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.  కోనసీమలో దాదాపు 30 గ్రామాల్లోకి చేరుతుంది వరద నీరు. నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  జల దిగ్బంధంలో  లంక గ్రామాలకు చిక్కుకున్నారు.  మెక నైజెడ్ బోట్లు, లైఫ్ జాకెట్లు,గజ ఈతగాళ్లు, త్రాగునీరు, ఫుడ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. దాదాపు 62,500 ఎకరాలు ముంపులో ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 62,500 ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాలకు సరిపడా నారుమళ్లు, 1,250 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపులో ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version