ఏపీ ప్రజలకు శుభవార్త..అన్న క్యాంటీన్లపై కీలక ప్రకటన

-

ఏపీ ప్రజలకు శుభవార్త..అన్న క్యాంటీన్లపై కీలక ప్రకటన చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తాజాగా రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్ లకు కొత్తగా నియమించబడిన కమిషనర్ల తో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించడం జరిగింది. సచివాలయం లో జరిగిన సమీక్షకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరీనారాయణన్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ,స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు హాజరు అయ్యారు.

In Pics Nandamuri Balakrishna relaunches Anna canteen in Hindupur

ఈ సందర్భంగా ఆయా కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, టిడ్కో ఇళ్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ… రోడ్ల పై సెంట్రల్ డివైడర్ లలో ఎలాంటి ఫ్లెక్సీలు ఉన్నా వెంటనే తొలగించాలని.. సెంట్రల్ డివైడర్ లలో ఫ్లెక్సీలు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తాగునీటి పరీక్షలు చేయాలి… వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు(స్టేరిలైజేషన్) చేయించాలని ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version