Goods train derailed in Alluri district: అల్లూరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కేకే లైన్ లో కొండ చరియలు….విరిగిపడుతున్నాయి. దీంతో అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు వాగన్ పట్టాలు తప్పింది. కొత్తవలస కిరండూల్ రైలు మార్గంలో ట్రాక్ పై బండరాళ్లు జారిపడ్డాయి.

ఈ తరుణంలోనే… విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న గూడ్స్ రైలు లో ఒక వాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు వాగన్ పట్టాలు తప్పడంతో… రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగారు రైల్వే శాఖ అధికారులు. ట్రాక్ ను పునరుద్దించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన రైల్వే శాఖ….ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. గూడ్స్ రైలు వాగన్ పట్టాలు తప్పడంతో.. విశాఖ -అరకు కిరండూల్ పాసింజర్ రైలు రద్దు అయింది. దీంతో ఇవాళ పర్యాటకులకు నిరాశ తప్పలేదు.