అసైన్డ్ భూములకు నష్టపరిహారంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల కోసం లేదా భూసేకరణ నిమిత్తం భూములు వెనక్కి తీసుకుంటే మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది.
ఇకపై అసైన్డ్ భూములు కలిగినవారికి ఇతర భూముల యజమానులతో సమానంగా మార్కెట్ విలువ ప్రకారమే చెల్లింపులు ఉంటాయని రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల కోసం నియోజకవర్గ ఇన్చార్జ్ లను మారుస్తూ ఓవైపు కసరత్తు చేస్తున్న వైసీపీ…. మరోవైపు ఎన్నికల సమరానికి శంఖారావం పూరించనుంది. ఈ నెల 27న విశాఖ-విజయనగరం జిల్లాల మధ్య భారీ బహిరంగసభ నిర్వహించనుంది. సీఎం జగన్ పాల్గొనే ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. రెండు రోజుల్లో వేదిక ప్రాంతాన్ని ఖరారు చేయనుండగా…. భీమిలి పరిధిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.