ఋషికొండ బీచ్ ఎంట్రీ ఫీజు వసూలుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

-

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ కి వెళ్లే సందర్శకుల నుంచి ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం భావించింది. బీచ్ కి వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేయాలనుకోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. బీచ్ ఎంట్రీ ఫీజు 20 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పదేళ్ల లోపు వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది.

11 నుండి ఎంట్రీ ఫీజు విధానం అమలులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ నిర్ణయం పై వెనక్కి తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం. బ్లూ ఫ్లాగ్ ఇచ్చినందున ఫీజు పెట్టాలని కేంద్రం ప్రతిపాదనలు చేసిందని.. ఆ రుసుమును రాష్ట్ర ప్రభుత్వమే భరించి ప్రజలకు మినహాయింపు ఇస్తుందని తెలిపారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version