బీహార్ లో చెల్లని రూపాయి..ప్రశాంత్‌ కిషోర్‌ పై గుడివాడ సెటైర్లు

-

బీహార్ లో చెల్లని రూపాయి అంటూ..ప్రశాంత్‌ కిషోర్‌ పై మంత్రి అమర్ నాథ్ సెటైర్లు పేల్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ కు ఓటమి కాదు.. భారీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

gudiwada amarnadh counter to prasanth kishore

అయితే…ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి అమర్ నాథ్. ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు…గతంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదని ఫైర్‌ అయ్యారు.మరి టీడీపీ ఎలా గెలుస్తుంది ? ప్రశాంత్ కిషోర్ రహస్యంగా పలుమార్లు చంద్రబాబును కలిశాడన్నారు. బీహార్ లో చెల్లని రూపాయి వచ్చి, ఇక్కడ రూపాయి సంపాదించుకోవాలని చూస్తోంది…ప్రజల్లో బలం లేని వారే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గతంలో లగడపాటి టీడీపీకి 130 సీట్లు వస్తాయని చెప్పారు.. ఏమైందంటూ నిలదీశారు మంత్రి అమర్ నాథ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version