తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్….రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సాధారణ దర్శనాలు జరుగనున్నాయి. రేపు శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టిటిడి.. తిరుమల శ్రీవారి ఆలయంలో సాధారణ దర్శనాలు ప్రారంభించనుంది. అటు ఇవాళ తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసింది టిటిడి పాలక మండలి.
ఆఫ్ లైన్ లో జారి చేసే శ్రీవాణి టిక్కెట్లు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టిటిడి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్న భక్తులను నేరుగా దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తోంది టిటిడి పాలక మండలి.
ఇక అటు నేటితో ముగియనున్నాయి వైకుంఠ ద్వార దర్శనాలు. ఇవాళ్టితో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. 6 లక్షల 80 వేల మంది భక్తులు పది రోజుల వ్యవధిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. నేటితో ఈ సంఖ్యకు చేరుతుంది తిరుమల శ్రీ వారి భక్తుల సంఖ్య.