పవన్ ను డిప్యూటీ సీఎంగా చూడటం ఆనందంగా ఉంది : నాగబాబు

-

పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎంగా చూడటం ఆనందంగా ఉందన్నారు మెగా బ్రదర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.   అన్ని విషయాల్లో సామర్థ్యం, అన్ని అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి పవన్ అని అన్నారు. పవన్ కి తగిన పదవులు, శాఖలు వచ్చాయని, సమర్థత కలిగిన పవన్ కి ఈ పదవీ దక్కిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మంచి రోజులు వస్తున్నట్టు కనపడుతున్నాయని ఆయన కామెంట్ చేశారు. సొసైటీలో చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కామెంట్ చేశారు.

ఇవాళ ఉదయమే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. బాధ్యతలు చేపట్టారు జనసేనాని.. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. అయితే, ఈ మధ్యే.. మెగాస్టార్ చిరంజీవి భార్య, తన వదిన సురేఖ.. జనసేనాని పవన్ కల్యాణ్ కి ఓ పెన్ గిఫ్ట్ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేస్తున్న తరుణంలో.. తన వదిన గిఫ్ట్ గా ఇచ్చిన పెన్నును పవన్ కల్యాణ్ ఉపయోగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version