మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : ప‌వ‌న్

-

స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తారు మన భారతీయులు.గిరులు,విరులు,నదులు సమస్త ప్రకృతిని స్త్రీ రూపంగా స్తుతిస్తూ వారిని గౌరవించడం మన సనాతన సంప్రదాయంలో ఒక భాగం.అటువంటి స్త్రీమూర్తుల విజయాలకు హర్షద్వానాలు పలుకుతూ జరుపుకునే మహిళాదినోత్సవం శుభతరుణాన మాతృమూర్తులు,ఆడపడుచులు యావత్ మహిళా లోకానికి నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షాలు.

pawan-kalyan

తల్లిగా..సోదరిగా..భార్యగా..తనయగా..అవాజ్యమైన ప్రేమానురాగాలు అందించే మహిళామణులను ఎంత కొనియాడినా తక్కువే. నవీన కాలంలో వారు సాధించని విజయాలు లేవు. వారు అధిరోహించని పదవులూ లేవు. నేను జనసేన పార్టీని స్థాపించి కొనసాగిస్తున్న రాజకీయ యజ్ఞంలో మా వీర మహిళలు అందిస్తున్న సేవలు, వారి అండదండలు వెలకట్టలేనివి.

చిరస్మరణీయమైనవి.స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లుతాయని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్న వ్యాఖ్య‌లు సదా ఆచరణీయం.సర్వదా అనుసరణీయం.మహిళాభ్యున్నతికి, వారికి రాజకీయ, ఆర్థిక, సాంఘికంగా సమాన అవకాశాల సాధనలో మహిళలకు నా వంతు సహకారం అనునిత్యం ఉంటుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాను

Read more RELATED
Recommended to you

Exit mobile version