ప్రేమించమని యువతి ఇంటికి వెళ్లి వేధించిన యువకుడు.. కేసు నమోదు చేసి..!

-

ప్రేమించమని యువతి ఇంటికి వెళ్లి వేధించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్ SI తెలిపారు. ప్రసాద్ అనే నిందితుడు కొరమీనుగుంటలో ఉంటూ, తిరుపతిలో టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. యువతి రంగంపేట దగ్గర ఉన్న ఒక కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నది. గతంలో యువతిని వెంబడించి ప్రేమించమని వేధించాడు.. అయితే యువతి నిరాకరించింది. ఈ క్రమంలో ప్రసాద్ తన మిత్రుల బృందంతో నేరుగా యువతి ఇంటికే వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నిస్తే అమ్మాయి తల్లి, బంధువులు నిలువరించారు.

యువతి యొక్క తల్లి, బంధువులతో వాగ్వాదానికి దిగి, వారిని బెదిరించారు. అంతేతప్ప ఎలాంటి గొడవలు జరగలేదు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో న్యూస్ ఛానెల్స్ లో తప్పుడు వార్తలు వస్తున్నాయి.. ఇందులో ఎలాంటి నిజం లేదు వాస్తవాలను వక్క్రీకరిస్తు వార్తలను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version