పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష..!

-

పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఇందులో మెగా డిఎస్సీ నిర్వహణ విధివిధానాలపై చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువమంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే లక్ష్యం. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు ఈనెల 11వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుపర్చే చర్యల్లో భాగంగా తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ డిసెంబర్ మొదటివారంలో మెగా పిటిఎం జరగనుంది.

వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తిచేయాలి. రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు అపార్ ఐడి కార్యక్రమం ఇప్పటివరకు 57.48శాతం పూర్తి కాగా.. సాధ్యమైనంత త్వరగా అపార్ ఐడీ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు మంత్రి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ రిపోర్టు కార్డులు అందజేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ ర్యాంకింగ్స్ పై దృష్టి సారించాలి. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ కళాశాలల్లో పాస్ పర్సంటేజి మెరుగుదలపై దృష్టి సారించాలి. అవసరమైతే వెనుకబడిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు నిర్వహించాలి. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలను ఎఐ ద్వారా ఎవాల్యుయేషన్ చేసే అంశాన్ని పరిశీలించాలి అని మంత్రి లోకేష్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version