చంద్రబాబు, పవన్ కు బహిరంగ లేఖ అంటూ మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య లేఖ విడుదల చేశారు. కృష్ణ గుంటూరు జిల్లాల్లో రాజధాని పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుమారు 50 వేల కోట్లను ఖర్చు చేశారని… మరో 50 వేల కోట్లు ఖర్చు చేయడనికి కూడా సిద్ధం అవుతున్నారని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆఫీసులు శాసనసభ శాసనమండలి హైకోర్టు వంటి వాటికోసం ఖర్చు చేయడం మంచిదేనన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభలో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటూనన్నారని గుర్తు చేశారు. మరి గోదావరి జిల్లాల అభివృద్ధికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు. విద్య వైద్యం రోడ్లు రవాణా వ్యాపార వ్యవసాయ సాగునీరు తాగునీరు పరిశ్రమలు ఓడరేవులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఏళ్ల తరబడి సమగ్ర అభివృద్ధికి నోచుకోని గోదావరి జిల్లాలకు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి పథకాలకు ఎంత ఖర్చు చేశారో వైట్ పేపర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి ఒకసారి ప్రతి జిల్లాకు చేసిన ఖర్చుపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలు సంతోషిస్తారని తెలిపారు.