పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు…టీడీపీపై హరిరామ జోగయ్య లేఖ

-

తెలుగు దేశం పార్టీకి బిగ్‌ షాక్‌ ఇచ్చారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. తాజాగా టీడీపీ – జనసేన పార్టీల పొత్తులపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జన సేనకు 25-30 సీట్ల పొత్తు విఫల ప్రయోగమే అని ఫైర్‌ అయ్యారు. జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.

Harirama Jogaiah’s letter on TDP is giving a blow to the alliance

పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సర్దుకు పోవటమే కారణమా..? అంటూ లేఖలో ప్రశ్నించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. 2019లో పోటీ చేసి ఓడిపోయిన అనేకమంది జనసేన నాయకులు 2024 లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్ల కేటాయిస్తారన్న సంకేతాలు ఆశావాహులను నిరాశ నిస్పృహలకు లోన ఎలా చేస్తున్నాయని తెలిపారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తూ టిడిపికి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version