ఎవరో బటన్‌ నొక్కితే బతికే కర్మ మనకు లేదు: హరీశ్‌ శంకర్‌

-

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నిక కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం ప్రజంలదరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓటు హక్కు ఆవశ్యకతపై దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన నాయకులు కాదని.. సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చుపెట్టిన నాయకున్ని గుర్తించాలని సూచించారు. ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదంటూ వ్యాఖ్యానించారు. మన బటన్ మనమే నొక్కాలి అదే ఈరోజు ఈవీఎం బటన్ అవ్వాలి అని పిలుపునిచ్చారు. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా అని హరీశ్ శంకర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version