చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. ఆరోగ్య పరిస్థితి బాగోలేదు: న్యాయవాది

-

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన బస చేసిన బస్సు వద్దకు వచ్చిన పోలీసులు.. ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్‌ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఆయన కాన్వాయ్‌లోనే ఎన్‌ఎస్‌జీ భద్రతతో విజయవాడకు తరలించనున్నారు.

చంద్రబాబు అరెస్టుపై ఆయన తరఫు న్యాయవాది స్పందించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారని.. వైద్యపరీక్షల్లో చంద్రబాబుకు హైబీపీ, షుగర్‌ ఉందని తేలిందని చెప్పారు. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్‌కు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. కేసుతో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారని న్యాయవాది ఆరోపించారు. స్కిల్ డెవలెప్‌మెంట్‌కేసులో 37వ ముద్దాయిగా పేర్కొన్నారు అని చంద్రబాబు న్యాయవాది తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version