విజయవాడలో వర్షం బీభత్సం.. కొండరాయి పడి ఇల్లు ధ్వంసం..!

-

విజయవాడలో వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి నుంచి వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్లు ప్రాంతాలన్ని నీట మునిగాయి. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడ రోడ్లపై వరద నీరు భారీగానే నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఇళ్ల లోకి వర్షం నీరు చేరింది. విద్యాధరపురం కోటయ్య వీధి కొండ ప్రాంతాలలో భారీ ప్రమాదం తప్పింది.

కొండరాయి జారి పడి ఓ ఇల్లు ధ్వంసం అయింది. ఈ ఘటనలో  ఓ మహిళకు గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ధ్వంసమైన ఇంటి శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. రైతులు పొలాలకు వెళ్లొద్దని, చెట్ల కింద నిల్చొవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో అటు స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version