ఏపీ మంత్రి లోకేశ్‌ను కలిసిన హైదరాబాద్‌ క్యాబ్‌ డ్రైవర్లు

-

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ క్యాబ్‌ డ్రైవర్లు లోకేశ్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లించాలని అక్కడి అధికారులు చెబుతున్నారని క్యాబ్ డ్రైవర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే వాహనాలకు లైఫ్‌ ట్యాక్స్‌ కట్టామని అన్నారు. మరోసారి లైఫ్‌ ట్యాక్స్‌ కట్టడం వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టపోతామని .. హైదరాబాద్‌లో ఏపీ వాహనాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి భేటీలో తమ సమస్యకు పరిష్కారం లభించేలా చూడాలని ఈ సందర్భంగా విన్నవించారు. హైదరాబాద్‌లో తమ వాహనాలకు మరికొంతకాలం వెసులుబాటు కల్పించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version