నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈబీసీ నేస్తం అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమమని అన్నారు. ప్రతి మహిళను వారి కాళ్ళపై వారిని నిలబెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు సీఎం జగన్. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. గతానికి, ఇప్పటికీ తేడా గురించి అడగాలని.. చంద్రబాబు ముష్టి వేసినట్లు వెయ్యి పెన్షన్ ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకు సీఎం పదవి అంటే దోచుకోవడం, దాచుకోవడం, తినుకోవడం అని ఆయన ధ్వజమెత్తారు. రాబోయే కాలంలో ఇంకా చాలా డ్రామాలు చూస్తామని, వాళ్లకి తోడుగా వాళ్ల దత్తపుత్రుడు ఉంటే.. నేను ప్రజలను నమ్మి ముందుకు వెళుతున్నానని అన్నారు. తనకి ప్రజలే సైనికులని, ప్రజలు మంచి చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు.