నటి సౌందర్య మృతి నేపథ్యంలో… మంచు మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిందన్న కథనంపై వెలుగులోకి కొత్త కోణాలు వస్తున్నాయి. సౌందర్య మరణానికి మోహన్ బాబు కారకుడని, ఇది కేవలం ప్రమాదం కాకుండా ఓ కుట్రగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఖమ్మం జిల్లా రూరల్ మండలానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి ఆరోపణలు చేసారు.
ఈ మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు ఖమ్మం జిల్లా రూరల్ మండలానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి . జల్‌పల్లిలోని ఆరెకరాల గెస్ట్ హౌస్‌ను మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడని.. ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
https://twitter.com/bigtvtelugu/status/1899694884564656429