AP : ఈనెల 15వ తేదీ నుంచి ఐసెట్ తుది విడత కౌన్సిలింగ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఐసెట్ కౌన్సిలింగ్ పై కీలక ప్రకటన చేశారు అధికారులు. ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు అధికారులు. ఐసెట్ తొలి విడత కౌన్సిలింగ్ కు సంబంధించిన ప్రాసెస్ ను ఈనెల 15 నుంచి నిర్వహించనున్నట్లు ఐసెట్ కన్వీనర్ రామ మోహన్ రావు ప్రకటన చేశారు.

ICET final phase counseling from 15th of this month

రిజిస్ట్రేషన్లు 15వ తేదీ నుంచి 17వ తేదీలలో ఉంటాయని వివరించారు. అలాగే ధ్రువపత్రాల పరిశీలన 16 నుంచి 18 వ తేదీ మధ్యల ఉన్నట్లు స్పష్టం చేశారు. కోర్సులు మరియు కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్చికల నమోదు ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే వెబ్ ఐచ్చికల మార్పు నవంబర్ 20వ తేదీన ఉంటుందని వెల్లడించారు కన్వీనర్. సీట్ల కేటాయింపు నవంబర్ 22వ తేదీన చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు కన్వీనర్ రామ మోహన్ రావు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని కూడా స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version