ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్పీ నోటిఫికేషన్ : మంత్రి లోకేశ్

-

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్పీ నోటిఫికేషన్ వేయనున్నట్టు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రలో 80 శాతం టీచర్ల నియామకం చేపట్టింది. టీడీపీనే అని గుర్తుకు చేసారు.

ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యాశాఖ కమిషనర్ ప్రతీ శుక్రవారం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు వింటున్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్నయాలు తీసుకునే వ్యవస్త కాదు.. గత ప్రభుత్వం రూ.3వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టింది. మేము వచ్చాక రూ.800 కోట్లు చెల్లించామని.. జగన్ పెట్టిన ఫీజు బకాయిలపై వైసీపీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version