మేం గేట్లు తెరిస్తే వైసీపీ నేతలంతా టీడీపీలోకి వస్తారు – గోరంట్ల బుచ్చయ్య చౌదరి

-

తాము గేట్లు తెలిస్తే వైసీపీ నేతలు అంతా టిడిపిలోకి వస్తారని అన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యిందన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కూడా అరాచక శక్తులకు అండగా నిలిచారని మండిపడ్డారు.

చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం నుంచి ఫలితం కనబడుతుందన్నారు బుచ్చయ్య చౌదరి. నిరుద్యోగుల వలసలు ఆపాలంటే ఉద్యోగాలు, ఉపాధి కల్పన కల్పించాలన్నారు. ఇసుక పాలసీలో నూతన విధానాలు రూపొందిస్తున్నామని.. అందువల్ల ఇసుక సరఫరాలో కొంత జాప్యం జరుగుతుందని తెలిపారు.

కొంతమంది అధికారులకు ఇంకా పాత వాసన పోలేదని.. వారిని దారిలోకి తీసుకువస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తామన్నారు. వైసిపి నేతలు తప్పుడు ప్రచారంతో బతకాలనుకుంటున్నారని మండిపడ్డారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎందుకు తీసుకురాలేదు..? అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version