ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

ఉగాదికి గద్దర్ అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయిం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ ను ప్రపంచ గమ్య స్థానంగా మారుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti Vikramarka

అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు భట్టి విక్రమార్క వెల్లడించారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసింది అన్నారు. బీఆర్ఎస్ చిత్ర పరిశ్రమ నిర్లక్స్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవార్డుల పంపిణీ జరుగలేదన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అబివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అందజేయాలని నిర్ణయించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version