విజయవాడలోని విహారం దారులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి విజయవాడలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి రానున్నాయి. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే ఇద్దరికీ జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతే రూ. 10 వేలు ఫైన్ వేయనున్నారు.
ఓవర్ స్పీడ్, రేసింగ్ తరహాలో డ్రైవింగ్ చేస్తే శిక్ష తప్పదు హెచ్చరిస్తున్నారు. రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కిస్తే ఒక్కొక్కరికి రూ.200 చొప్పున జరిమానా వేయనున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, రవాణా శాఖ అధికారులపై వాగ్వాదానికి దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.