ఏపీలో మళ్లీ జగనే గెలుస్తాడన్న ఇండియా టుడే!

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ఫలితాలు జూన్ 04న వెలువడనున్న నేపథ్యంలో ఎప్పుడు ఫలితాలు వస్తాయోనని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందా..? లేక మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందా అని కొంత మంది బెట్టింగ్ లు కూడా వేస్తున్నారు.

CM Jagan’s sensational announcement on Land Titling Act

ఎక్కువగా సీఎం గా జగన్ అధికారంలోకి వస్తాడని పేర్కొనడం గమనార్హం. మరోవైపు చంద్రబాబు కూడా అధికారంలో రావడం ఖాయమని కొంత మంది చెబుతున్నారు. తాజాగా ఏపీలో మళ్లీ జగనే గెలుస్తాడన్న ఇండియా టుడే పేర్కొంది. ముఖ్యంగా ఐదేళ్లు సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు ఏకపక్షంగా జగనన్నకి మద్దతుగా నిలిచారని మ్యాగజైన్‌ స్టోరీలో జోస్యం చెప్పింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య లుకలుకలు కూటమిని దెబ్బతీస్తే.. జగనన్న చేసిన సిద్ధం నినాదం కోట్లాది మందిని పార్టీకి చేరువ చేసిందని ప్రశంసింది. ఇక అభ్యర్థుల ఎంపికలో జగనన్న చేసిన సోషల్ ఇంజినీరింగ్ దెబ్బకి కూటమి కుదేలైపోయిందని వెల్లడించింది ఇండియా టుడే.

Read more RELATED
Recommended to you

Exit mobile version