ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎ లా స్పందిస్తుందా? అని అందరూ ఎదురు చూశారు. తెలంగాణ వైఖరి కారణంగా రాయల సీమ రైతాం గం తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది వాస్తవం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచడం వల్ల శ్రీశై లం ప్రాజెక్టు నుంచి మన హక్కుగా సంక్రమించే జలాలను ఎత్తిపోసుకుని సీమకు తరలించే అ వకాశం ఉం టుంది. అదేసమయంలో ప్రాజెక్టు కాల్వలను వెడల్పు చేయడం కూడా సీమ రైతాంగానికి సం తోషాన్నిచ్చే దే!
అయితే, ఈవిషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పై కి కేసీఆర్ మౌనంగా ఉన్నప్పటికీ.. తన రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనని బావించి.. తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలో ముప్పేట దాడి ఏ పీపై జ రుగుతోంది. అయితే, ఈ విషయంలో జగన్ ఎంతవరకైనా వెళ్తానని చెబుతున్నారు. ఈ సమయం లో జగన్కు అండవా నిలవాల్సిన ప్రధానప్రతిపక్షం టీడీపీ ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తోంది. తా జాగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్తాయిలో వి మర్శలు వస్తున్నాయి.
విషయాన్ని విషయంగా చూడకుండా దేవినేని పోతిరెడ్డిపాడును రాజకీయంగా మాట్లాడడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఏడాది పాటు అధికారం పూర్తిచేసుకున్న వైసీపీ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా..తగుదునమ్మా.. అంటూ.. ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై దృష్టిపెట్టి హడావుడి చేస్తోందని దేవినేని ఎద్దేవా చేశారు. అదేసమయంలో ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులపై దృష్టి పెట్టిందో వివరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. నిజానికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా దేవినేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ అనుకోలేదు.
ఒక నిర్మాణాత్మక వైఖరిలో వ్యాఖ్యానిస్తారని అనుకున్నారు. పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు నష్టం లేదని అన్ని పక్షాల నుంచి వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ కూడా తనదైన శైలిలో ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరిస్తుందని అనుకున్నారు. కానీ, దేవినేని ఉమా మాత్రం.. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయా న్ని కూడా ఇంత దారుణమైన యాంగిల్లో ఆలోచిస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే, కేసీఆర్కు భయపడుతున్న టీడీపీ నేతల నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తాం అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలోని కొన్ని గ్రూపుల నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. టీడీపీ వైఖరిపై రైతాంగం తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తోంది.