క‌డ‌ప ను వ‌ణికిస్తున్న వ‌ర్షం.. సోమవారం విద్యాసంస్థలు బంద్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ ను వ‌ర్షాలు వీడ‌టం లేదు. ఈ రోజు కూడా అల్ప పీడ‌న ప్ర‌భావంతో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అలాగే ఈ రోజు అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో కురుస్తున్న వ‌ర్షాలు క‌డ‌ప జిల్లాను వ‌ణికిస్తున్నాయి. ఈ రోజు ఉద‌యం నుంచి ప‌డుతున్న వ‌ర్షా ల‌తో క‌డ‌ప జిల్లాకు వ‌ర‌ద‌లు పొటేత్తాయి. దీంతో జిల్లా లో చాలా గ్రామాలు జ‌ల‌మ‌ య‌మ‌య్యాయి. కడ‌ప జిల్లా కేంద్రం లో ని ఎన్జీవో కాల‌నీ, బాలాజీ న‌గ‌ర్‌, ఆర్టీసీ బ‌స్టాండ్‌, అప్స‌రా స‌ర్కిల్‌, శంకరాపురం తో పాటు కోఆప్ రేటివ్ కాల‌నీ ప్రాంతాల లో వ‌ర‌ద నీరు భారీ గా చేరింది.

ఈ అల్ప పీడన ద్రోణీ వ‌ల్ల మ‌రో రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో సోమ వారం జిల్లా లోని అన్ని విద్యా సంస్థ ల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తు జిల్లా విద్యా శాఖ నిర్ణ‌యం తీసుకుంది. అలాగే జిల్లా లోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధి కారులు అప్ర‌మ‌త్తం చేశారు. పాత ఇళ్ల లో ఉండ వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. వ‌ర్ష ప్ర‌భావం తో ఎ స‌మ‌స్య వ‌చ్చిన అధికారుల‌కు తెల‌పాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version