ఓటేసిన సీఎం జగన్ దంపతులు, చంద్రబాబు కుటుంబం

-

ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఉదయాన్నే వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో కలిసి వచ్చి ఓటేశారు. పులివెందులలోని భాకరాపురం పోలింగ్‌ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుంది. చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌, బ్రాహ్మణి ఓటేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు ఓటేశారు. రైల్వే కల్యాణ మండపంలోని 155 పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

మరోవైపు నా అవ్వాతాతలందరూ… నా అక్కచెల్లెమ్మలందరూ… నా అన్నదమ్ములందరూ… నా రైతన్నలందరూ… నా యువతీయువకులందరూ… నా ఎస్సీ… నా ఎస్టీ… నా బీసీ… నా మైనారిటీలందరూ… అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి! అంటూ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ఓటర్లను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version