జగన్ ప్రతి పక్ష హోదాపై హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు అయింది. వైఎస్ జగన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు జగన్. పిటిషన్ కు విచారణ అర్హత లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. ఆర్టికల్ 208, 212 ప్రకారం ఉందన్నారు జగన్ అడ్వకేట్. రాజకీయంగా కాకుండా కక్షపూరితంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదని కోర్టుకు తెలిపారు జగన్ అడ్వకేట్.
స్పీకర్, శాసన సభ వ్యవహారాల మంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ యూ ట్యూబ్ లింకులు కోర్టుకు ఇచ్చారు పిటిషనర్. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్ కు జగన్ రిప్రజెంటేశన్ ఇచ్చారా అని ప్రశ్నించారు న్యాయమూర్తి. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు తెలిపారు జగన్ అడ్వకేట్. ఈ తరుణంలోనే.. చంద్రబాబుకు షాక్ ఇస్తూ…. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది కోర్టు. ఇక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మూడు వారాలకి విచారణ వాయిదా వేసింది హైకోర్టు.