గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. తాజాగా రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో నటుడు, జనసేన పార్టీ నేత పృథ్వీ మాజీ సీఎం జగన్ ను ఇమిటేట్ చేసారు. సభల్లో జగన్ మైక్ పై తడుతూ అభివాదం చేసినట్టుగా అలాగే పృథ్వీ చేశారు.
“మా దేవుడు పవన్ కళ్యాణ్.. గేమ్ ఛేంజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఇది దేవుడి స్క్రిప్ట్. మొన్నే ఓ సినిమాలో అపోజిషన్ వ్యక్తి క్యారేక్టర్ చేయించారు. అసలే పవర్ లో లేను.. 11 సీట్లే వచ్చేశాయి ఏం చేయాలి అని చెప్పా. ఎక్కడ దొరికితే అక్కడ సెటర్లు వేస్తున్నాం” అని వ్యాఖ్యానించారు పృథ్వీ. అలాగే గేమ్ ఛేంజర్ సినిమాకి రామ్ చరణ్ నేషనల్ అవార్డు రావడం పక్కా అని కొనియాడారు.