సీఎం జగన్ కు షాక్ తగిలింది. పథకాల నిధులు విడుదల కాకుండా మరో పిటీషన్ దాఖలు అయింది. DBT ద్వారా నగదు జమ చేయటానికి హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో ఏపీ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ వేసింది నవతరం పార్టీ. దీంతో దీనిపై విచారణకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేయనుంది హైకోర్టు.
కాగా లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న టీడీపీ…హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు తెస్తోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.
డీబీటీ పథకాలను అడ్డుకుంటూ ఈసీ ఉత్తర్వులను ఇవ్వాళ్టి వరకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నిన్న అర్థరాత్రి అందుబాటులోకి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు వచ్చాయి. హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని సంప్రదించారు అధికారులు.
అయితే.. క్లారిఫికేషన్ కోసం ఈసీని కోరారు అధికారులు. ఇప్పటివరకూ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఈసీ. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమంటున్నారు అధికారులు ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.