చరిత్రలో ఎవ్వరూ చేయని తప్పులు మాజీ సీఎం జగన్ చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకా వాస్తవాలు రావాల్సి ఉంది. వాస్తవాలు అన్నీ వచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు. రాష్ట్రంలో గుంతలు భయంకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వమే ఏపీ బ్రాండ్, ఇమేజ్ దెబ్బతినేలా చేసింది. ఎవ్వరూ తప్పు చేసినా చర్యలు తీసుకుంటే ఇంకొకరు మరో తప్పు చేయరని తెలిపారు సీఎం చంద్రబాబు. గతంలో వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. రాష్ట్రంలో అప్పులు పరకాష్టకు చేరుకున్నాయి.
సంపద సృష్టిస్తేనే అప్పుల నుంచి బయట పడవచ్చు. గత ప్రభుత్వంలో వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని మండిపడ్డారు. నమ్మిన అసత్యాలను పదే పదే చెప్పి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. అందుకే విజన్ డాక్యుమెంట్ -2047 పేరుతో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రౌడీ రాజకీయాలు చేస్తామంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం వికసిత్ భారత్ తీసుకొస్తే.. ఏపీ విజన్ 2047 తీసుకొస్తామన్నారు.