గతంలో ప్రభాస్‌కు, షర్మిలకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అంతా సైలెంట్ అయ్యింది. అసలు ఈ ప్రచారం ఎవరు చేయించారో తెలీక అందరూ షాక్ అయ్యారు. మరికొందరు నిజమేనేమో అని అనుమానించారు. తాజాగా ఈ వివాదాస్పద అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తాజాగా స్పందించారు.
తన అన్న, మాజీ సీఎం జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ‘గతంలో నాకు, ప్రభాస్‌కు సంబంధం ఉందని సోషల్‌మీడియాలో ప్రచారం చేయించారు. మా పిల్లల మీద ఒట్టు వేసి చెబుతున్నా ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. నాపై బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందన్న జగన్.. సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు’అని ప్రశ్నించారు. కాగా, షర్మిల చేసిన ఆరోపణలపై జగన్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.