ఆంధ్రప్రదేశ్ లో ఈఎస్ఐ స్కాం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈఎస్ఐ స్కాం కి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ స్కాం లో మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో ఈఎస్ఐ తిరుపతి హాస్పిటల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రమేష్‌కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఏసీబీ బృందం అర్థరాత్రి ఆయనను అదుపులోకి తీసుకుంది.
అక్కడి నుంచి ఆయన్ను వెంటనే విజయవాడకు తరలించారు అధికారులు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో రవికుమార్ పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ కేసుకి సంబంధించి మరి కొందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి పాత్ర కూడా ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు వార్తలువస్తున్నాయి.
కొందరు కీలక టీడీపీ నేతలకు కూడా ఇందులో లబ్ది చేకూరింది అని సమాచారం. వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉంది అని తెలుస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రికి కూడా దీనిలో సంబంధం ఉంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. మొత్తం 40 మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.