త‌ల్ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న ఆప‌లేవు – నారా లోకేష్

-

త‌ల్ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న ఆప‌లేవని సీఎం జగన్‌ కు సవాల్‌ విసిరారు నారా లోకేష్. రాష్ట్రం ఏమైనా నీ జాగీరా జ‌గ‌న్ రెడ్డి! ఏపీలో ఏమైనా ఎమ‌ర్జెన్సీ విధించావా? కుప్పంపై ఏకంగా అప్ర‌క‌టిత యుద్ధ‌మే ప్ర‌క‌టించారు వైసీపీ పోలీసులు అని నిప్పులు చెరిగారు. బ్రిటీష్ చ‌ట్టానికి బూజు దులిపి అర్ధ‌రాత్రి జీవో ఇస్తావు. తెల్లారేస‌రికి ఉల్లంఘిస్తావని మండిపడ్డారు.

చ‌ట్టం మీ ఎదుగూరి సందింటికి ఎదురింటి చుట్ట‌మా? ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు గారు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించేందుకు నీ ఆంక్ష‌లేంటి? నీ కుతంత్రాల‌న్నీ కుప్పంలో ప్ర‌యోగిస్తున్నావు. చంద్ర‌బాబు గారి ప్ర‌చార‌ ర‌థం స్వాధీనం చేసుకున్నావు. కార్య‌కర్త‌ల్ని కొట్టిస్తున్నావు. నాయ‌కుల్ని నిర్బంధించావని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

ఎన్ని అరాచ‌కాల‌కు పాల్ప‌డినా నీపై ప్ర‌జావ్య‌తిరేక‌త త‌గ్గ‌దు. చంద్ర‌బాబు గారికి జ‌నాద‌ర‌ణ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 35 ఏళ్లుగా కుప్పం నీలాంటి కుట్ర‌దారుల‌ని ఎంతోమందిని చూసింది. తెలుగుదేశం కోట కుప్పంలో నీ కుప్పిగంతులు చెల్ల‌వు. ప‌సుపుసైన్యం క‌దం తొక్కుతోంది. నువ్వు త‌ల్ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా చంద్ర‌బాబు గారి కుప్పం ప‌ర్య‌ట‌న ఆప‌లేవన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version