ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంపై జగన్‌ కీలక నిర్ణయం

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంపై జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్‌ ఆదేశాల మేరకు నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానుంది వైసీపీ పార్టీ. వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. ఏపీలో హత్యాకాండ, దాడులపై గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసన తెలపనుంది వైసీపీ పార్టీ.

Jagan’s key decision on attending AP assembly meetings

ఇవాళ ఉదయం 9.20కి.బయల్దేరి అసెంబ్లీకి చేరుకోనున్నారు జగన్, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు. కాగా, ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం అంటే నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.

సమావేశాలకు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే అసెంబ్లీలో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు.5 రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version