పిఠాపురంలో కొట్టుకున్న జనసేన, టీడీపీ నేతలు..!

-

పిఠాపురం నియోజక వర్గంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీల మధ్య గొడవ మొదలైపోయింది. ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే.. జనసేన పార్టీ నేతలపై రెచ్చిపోతున్నారు టీడీపీ తమ్ముళ్లు. తాజాగా పిఠాపురం తాటిపర్తి గ్రామంలో జనసేన, టిడిపి మధ్య వార్ చోటు చేసుకుంది.

janasena vs tdp fight

తాడిపర్తి లో వెలసినటువంటి అపర్ణ దేవి అమ్మవారు బాధ్యతలు కొరకు జనసేన, టిడిపి పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే… ఆ ఆలయ నిర్వహణ కమిటీ జనసేన కావాలంటూ జనసేన పార్టీ వారు డిమాండ్‌ చేస్తున్నారు. నిర్వహణ కమిటీ టిడిపి కావాలంటూ టిడిపి పార్టీ వారు మొండిపట్టు పట్టారు. కానీ వైసీపీ పార్టీ నేతలు మాత్రం… జనసేన పార్టీకి సపోర్ట్‌ గా ఉన్నారు. దీంతో జనసేన పార్టీ, టీడీపీ పార్టీల మధ్య గొడవ మొదలైపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version