రేషన్ బియ్యం మాయం కేసులో విచారణకు రావాలని పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవల పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది జిల్లా కోర్టు. పేర్ని నాని నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు అంటించారు పోలీసులు. బెయిల్ మంజూరు చేసే సందర్భంలో విచారణకు సహకరించాలని ఇప్పటికే సూచించిన జిల్లా కోర్టు… ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవాళ పేర్ని జయసుధను విచారణ చేశారు అధికారులు. తాజాగా ఆమె విచారణ ముగిసింది. ఆర్.పేట సీఐ ఏసుబాబు దాదాపు రెండు గంటలకు పైగా పేర్ని జయసుధను ప్రశ్నించారు. ఈ కేసులో పేర్ని జయసుధ ఏ1 గా ఉన్నారు. జయసుధకు ఇప్పటికే ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది న్యాయ స్థానం. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె బందు తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అవసరం అయితే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు సీఐ.