నన్ను 2,3 నెలలు జైల్లో పెడతారు అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం పై భూవివాదం కేసు కొనసాగుతోంది. సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం లావాదేవీలపై రంగంలోకి దిగారు సీఐడీ అధికారులు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేసిన సీఐడీ అధికారులు… నివేదికను ఏపీ డీజీపీకి అందించారు.
అయితే.. తాజాగా అగ్రి గోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారు…. సీజ్ చేసిన భూమి నెంబర్ పై అమ్మకాలు జరగవని వెల్లడించారు. లోకేష్ రెడ్ బుక్ అంటూ ఎలా అయినా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనీ చూస్తున్నారని ఆగ్రహించారు. మహా అయితే అరెస్ట్ చేసి 2,3 నెలలు జైల్లో పెడతారు అంతే కదా అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.